హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాహుల్‌‌గాంధీని తిరస్కరించారు, మా వైఫల్యం: కిషన్‌రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Kishan Reddy
హైదరాబాద్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తమ పార్టీ వైఫల్యం కారణంగా సీట్ల సంఖ్య తగ్గిందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చెప్పారు. అక్కడ బలం పెంచుకోవడంలో మాదే వైఫల్యం అన్నారు. మా వైఫల్యాలకు గుణపాఠం నేర్చుకొని ముందుకు వెళతామని ఆయన చెప్పారు. ఐదు రాష్ట్రాలలో ఫలితాలతో కాంగ్రెసు పార్టీ నేతల్లో నిరుత్సాహం కనిపిస్తోందన్నారు. ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ నాయకత్వాన్ని దేశ ప్రజలు తిరస్కరించారని అన్నారు. 2014 ఎన్నికల్లో ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందనేందుకు ఈ ఎన్నికలే నిదర్శనమన్నారు. గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో తాము ప్రభుత్వాలను ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో మా స్థానాలు పెరగనున్నాయన్నారు. దేశంలో యుపిఏ ప్రభావం తగ్గిందని ఈ ఐదు రాష్టాల ఎన్నికల వలన అర్థమవుతోందన్నారు.

ఉత్తర ప్రదేశ్‌లో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఆమె తనయుడు రాహుల్, తనయ ప్రియాంకా గాంధీ, రాబర్ట్ వాద్రా ప్రచారం పని చేయలేదన్నారు. కాగా ఉత్తర ప్రదేశ్‌లో తాము ప్రతిపక్షంలో కూర్చుంటామని జాతీయ నాయకత్వం ఢిల్లీలో ప్రకటించింది. సమాజ్ వాది లేదా బిఎస్పీతో పొత్తు ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. మాయావతికి ఈ ఎన్నికలు గుణపాఠం అన్నారు. జాతీయస్థాయిలో యుపిఏ ప్రభావం తగ్గుతుందని ఈ ఎన్నికల ఫలితాలు తెలియజేస్తున్నాయన్నారు.

English summary
BJP state president Kishan Reddy said that people rejected Rahul Gandhi leadership.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X