రాహుల్‌గాంధీ యుపికే కాదు: అఖిలేష్‌యాదవ్ కౌంటర్

కాగా ఎస్పీ అధికారాన్ని చేజిక్కుంచుకునే దిశలో దూసుకుపోతున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఎస్పీ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. లక్నోలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు హంగామా చేస్తున్నారు. మరోవైపు తాము ఎస్పీకి మద్దతిచ్చే ప్రసక్తి లేదని భారతీయ జనతా పార్టీ స్పష్టం చేసింది. కాంగ్రెసు పార్టీ కూడా తాము ఎస్పీకి గాని, బిఎస్పీకి గానీ మద్దతి ఇచ్చే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాయి. అయితే ఉత్తర ప్రదేశ్‌లో ఎస్పీ దూసుకు పోతున్నప్పటికీ హంగ్ ఏర్పడనుందని పరీశీలకులు భావిస్తున్నారు. ఎవరికి వారే మద్దతు లేదని పైకి చెబుతున్నప్పటికీ, పొత్తుల కోసం పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications