బొత్సకు ఆలస్యంగానైనా జ్ఞానోదయమైంది: నారాయణ

ప్రాంతీయ పార్టీలు బలపడి జాతీయ పార్టీలు దేశంలో బలహీనపడడం మంచి పరిణామం కాదని, అయితే సకల అరిష్టాలకు కారణమైన కాంగ్రెసు బలహీనపడడం మంచి పరిణామమని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో మూడో కూటమి ఏర్పాటు విషయంపై తాము జాతీయ మహాసభల్లో చర్చిస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని మద్యం సిండికేట్లతో అధికార కాంగ్రెసు పార్టీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధాలున్నాయని ఆయన అన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెసుకు అవకాశం ఇవ్వకూడదని ఆయన అన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలతో కలిసి కేంద్రంలో అధికారం పంచుకోవడంపై తమ పార్టీ దృష్టి సారిస్తుందని ఆయన చెప్పారు. మహిళల హక్కుల సాధనకు సిపిఐ మద్దతు ఇస్తుందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications