నారాయణ వ్యాఖ్యలతో హర్ట్ అయ్యా: మంత్రి గీతా రెడ్డి

Geeta Reddy
హైదరాబాద్: సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ తనపై చేసిన వ్యాఖ్యలు తనతోపాటు తన భర్తను, కుమార్తెను తీవ్రంగా బాధపెట్టాయని మంత్రి గీతా రెడ్డి గురువారం అన్నారు. ఒక పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి భాష వాడరాదని, ఇది మహిళల పట్ల వివక్షేనని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని ఇక సాగదీయకూడదనుకుంటున్నానని చెప్పారు. నోటి దురుసు తగ్గించుకోవాలని నారాయణకు హితవు పలికారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఆమె ఓ చానల్‌లో గెస్ట్ ఎడిటర్‌గా వ్యవహరించారు. ఈ సందర్భంగా నారాయణ వ్యాఖ్యల ప్రస్తావన వచ్చినప్పుడు.. ఆయన పేరు చెప్పకుండా.. ఇరవై ఐదుళ్లుగా ప్రజా జీవితంలో ఉన్నానని, తనపై ఎవరూ వేలెత్తి చూపలేదని, ఓ పార్టీలో ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తి అలాంటి భాష వాడరాదన్నారు. అయితే ఆ తర్వాత నారాయణ ఫోన్ చేసి తనకు క్షమాపణలు చెప్పారని అన్నారు. పత్రికల్లో ఆయన అన్న వ్యాఖ్యలు చూడగానే చాలా హర్ట్ అయ్యానని ఆమె అన్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేద్దామనుకుంటున్నానని చెప్పారు. మహిళలు ఎవరు అయినా అలా మాట్లాడకూడదన్నారు.

కాగా ఇటీవల నారాయణ గీతారెడ్డిపై మాట్లాడాతూ.. సింగారించుకునేందుకే కానీ సమస్యలు ఆమెకేం తెలుసని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై దళిత సంఘాలతో పాటు అందరూ నారాయణపై మండిపడ్డారు. అయితే ఆ తర్వాత ఆయన గీతారెడ్డికి ఫోన్ చేసి క్షమాపణలు తెలియజేశారు. అంతకుముందు ఓఎంసి కేసులో అరెస్టైన ఐఏఎస్ శ్రీలక్ష్మి పైనా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+