హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్లమెంట్‌కే రాని కెసిఆర్‌కు ఎంపి పదవెందుకు?: నామా

By Srinivas
|
Google Oneindia TeluguNews

Nama Nageswara Rao
హైదరాబాద్: పార్లమెంటు సమావేశాలకు రాని తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ఎంపి పదవి ఎందుకు అని తెలుగుదేశం పార్టీ ఖమ్మం పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు శుక్రవారం మండిపడ్డారు. కెసిఆర్ వైఖరిని నిరసిస్తూ టిడిపి సీనియర్ శాసనసభ్యుడు మోత్కుపల్లి నర్సింహులు చేపట్టిన పాదయాత్రకు ఆయన ఈ రోజు మద్దతు పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పార్లమెంటుకు రాని కెసిఆర్ కు పదవి ఎందుకన్నారు. ఆయనకు తెలంగాణపై చిత్తశుద్ధి లేదన్నారు. ఉంటే పార్లమెంటుకు వచ్చి తెలంగాణపై కేంద్రాన్ని నిలదీసే వారన్నారు. పార్లమెంటులో ఏనాడైనా ఆయన తెలంగాణపై మాట్లాడారా అని ప్రశ్నించారు. తెలంగాణ పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఓట్లకు నోట్లకు సీట్లకు కెసిఆర్ తెరాస పార్టీని పెట్టారని, తెలంగాణ సాధించేందుకు మాత్రం కాదని ఆరోపించారు.

అనంతరం మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడారు. కెసిఆర్ వల్ల తెలంగాణ రాదన్నారు. వ్యాపారం కోసమే ఆయన పార్టీ పెట్టారన్నారు. సకల జనుల సమ్మె తదితర సమయాల్లో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ సంప్రతించని టిఆర్ఎస్ ఇప్పుడు ఓట్లు నోట్లు సీట్ల కోసమే ఆయన కాళ్లు పట్టుకుందన్నారు. ఉప ఎన్నికలకు తెలంగాణకు సంబంధం లేదన్నారు. తెరాస నేతలు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలకు చిత్తశుద్ధి ఉంటే అందరూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

English summary
TDP MP Nama Nageswara Rao demanded TRS chief K Chandrasekhar Rao resignation as MP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X