వైయస్ విగ్రహాలుచూస్తే దొంగబుద్దులు,సాక్షి వద్దు: బాబు

జగన్ అధికారంలోకి వస్తే పాలన పిచ్చోడి చేతిలో రాయి అవుతుందన్నారు. వైఎస్ చేసినంత అన్యాయం, అవినీతి ఏ సిఎం చేయలేదన్నారు. రెండేళ్లుగా ఓదార్పు చేస్తున్న జగన్ ఓ దోషి అని, ఆయన్ని ఓదార్చే సమయం ఆసన్నమైందని చెప్పారు. పాపిష్టి సొమ్ముతో పెట్టిన జగన్ పత్రిక చదవొద్దని, చానల్‌ను చూడొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. 30 ఏళ్ల చరిత్ర కలిగిన టిడిపి ఒక్క పత్రిక కూడా పెట్టలేదన్నారు. టిడిపి ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని, 30 ఏళ్లుగా రాజీలేని పోరాటం చేస్తున్న తమకు ఎవరితోనూ కుమ్మక్కు కావాల్సిన అవసరం లేదని చెప్పారు. చిరంజీవి సినిమా డబ్బా తిరుగుటపా అయిందని, కానీ, ఎన్టీఆర్ మడమ తిప్పని నేత అని కొనియాడారు. యూపీ ఫలితమే 2014లో ఆంధ్రప్రదేశ్‌లోనూ పునరావృతమవుతుందని జోస్యం చెప్పారు. ఇక టిడిపి సైకిల్ స్పీడుకు తిరుగు లేదన్నారు. ప్రతిపక్షాల డిమాండ్ మేరకే చిత్తూరు, విజయనగరం జిల్లాల్లోని మద్యం మాఫియాపై ఎసిబి దాడులకు ప్రభుత్వం ఆదేశించిందని చెప్పారు. తెలంగాణతోపాటు కోవూరులోనూ బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications