జగన్‌ ముందు రాహుల్‌ నిలబడలేరు: కొండా సురేఖ

Konda Surekha
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి చరిష్మా ముందు ఏఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చరిష్మా నిలబడదని మాజీ మంత్రి, జగన్ పార్టీ నేత కొండా సురేఖ గురువారం వరంగల్ జిల్లాలో అన్నారు. కడప ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎంత మెజార్టీ సాధించిందో ప్రజలకు అందరికీ తెలుసునన్నారు. రేపు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఐనా ఆ తర్వాత పరకాలలో వచ్చే ఉప ఎన్నికల్లోనూ అదే మెజార్టీ పునరావృతమవుతుందన్నారు. ఉప ఎన్నికలకు తాము ఎప్పుడూ భయపడలేదన్నారు. తన నియోజకవర్గ ప్రజలు తనను గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమకు సుశిక్షుతులైన సైనికుల్లాంటి కార్యకర్తలు ఉన్నారని చెప్పారు. వారే తమకు కొండంత అండగా నిలబడతారని అన్నారు. ఉప ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని చెప్పారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి కాంగ్రెసు పార్టీలో చేరతారనే దుష్ప్రచారం జరుగుతోందని, అది ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెసు పార్టీయే జగన్ పార్టీలో విలీనమవుతుందన్నారు. ఐదు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు దేశంలో కాంగ్రెసు పరిస్థితికి అద్దం పడుతోందన్నారు. రాహుల్ భావి ప్రధానిని అని, సోనియా త్యాగశీలి అంటున్న నేతలు వారి సొంత నియోజకవర్గాలలో ఘోర వైఫల్యానికి సమాధానం చెప్పాలన్నారు.

తాను దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డిపై ఉన్న అభిమానంతో మంత్రి పదవికి రాజీనామా చేశానని, ప్రత్యేక తెలంగాణకు కట్టుబడి శాసనసభ్యత్వాన్ని వదులుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో రాజకీయాలు నీచస్థితిగి చేరుకున్నాయని, అధికార దాహంతో వరంగల్ జిల్లా నేతలు, మంత్రులు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. మేం ప్రజల మనుషులమని, రేపు కూడా ప్రజల్లోనే ఉంటామని దేవుని సాక్షిగా చివరి శ్వాస వరకు కార్యకర్తలను కాపాడుకుంటూ, వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+