వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ప్రభుత్వం ఏర్పాటుకు మాయావతి పార్టీ కొత్త మెలిక

By Srinivas
|
Google Oneindia TeluguNews

Mayawati
డెహ్రాడూన్: మాయావతి ఆధ్వర్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ పెట్టిన కొత్త మెలికతో ఉత్తరాఖండ్‌లో ప్రభుత్వం ఏర్పాటు మరింత రసకందాయంలో పడింది. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో ఉత్తరాఖండ్‌లో బిఎస్పీ తరఫున ముగ్గుర ఎమ్మెల్యేలు విజయం సాధించారు. కాంగ్రెసుకు 32, బిజెపి 31, ఇతరులు మరో నలుగురు ఇతరులు గెలుపొందారు. సాధారణ మెజార్టీ 36కు కాంగ్రెసు, బిజెపి రెండు పార్టీలు కాస్త అటు ఇటు సమదూరంలో ఉన్నాయి. దీంతో ఇరు పార్టీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే గురువారం బిఎస్పీ కీలక ప్రకటన చేసింది. మేం కాంగ్రెసు, బిజెపిలకు రెండింటికీ సమదూరంలో ఉంటామని చెప్పారు. ఉత్తరాఖండ్ బిఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు సూరజ్ మాల్ ఈ ప్రకటన చేశారు. అయితే పార్టీ అధ్యక్షురాలు మాయావతితో చర్చించిన తర్వాత మద్దతుపై తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

కాగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఇటు కాంగ్రెసు, అటు బిజెపి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చోయబోతున్నామని పిసిసి అధ్యక్షుడు యశ్ పాల్ శర్మ ప్రకటించగా, ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని తామే ఏర్పాటు చేస్తామని మరోవైపు బిజెపి ఢిల్లీలో ప్రకటించింది. తాము ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే బిఎస్పీ మద్దతు ప్రకటించిందని కాంగ్రెసు చేసిన ప్రకటనను బిఎస్పీ తోసిపుచ్చింది. ఇలాంటి ఊహాగానాలు ప్రచారం చేయడం కాంగ్రెసుకు అలవాటేనన్నారు. అయితే మాయావతి ఏం చెబితే అది చేస్తామని చెప్పారు.

English summary
BSP Uttarakhand state president Surajmall said that they are maintaining same distance to Congress and BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X