గాలి జనార్ధన్‌రెడ్డి భార్య అరుణ లక్ష్మికి సిబిఐ నోటీసులు!

Gali Aruna Lakshmi
బెంగళూరు: అసోసియేటెడ్ మైనింగ్ సంస్థ అక్రమాల గురించి ఆ సంస్థ సంచాలకులు, కర్నాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి సతీమణి గాలి అరుణ లక్ష్మీని సిబిఐ ప్రశ్నించనున్నదని తెలుస్తోంది. విచారణ కోసం తమ ఎదుట హాజరు కావాల్సిందిగా ఆదేశిస్తూ ఆమెకు సిబిఐ తాఖీదుల్ని జారీ చేసిందని సమాచారం. త్వరలో ఆమె బెంగళూరులోని సిబిఐ కేంద్ర కార్యాలయంలో విచారణకు హాజరు కానున్నట్టుగా తెలుస్తోంది. సిబిఐ అధికారులు తమ స్వాధీనంలో నిందితులు గాలి జనార్ధన్ రెడ్డి, ఆయన పిఏ అలీఖాన్ పైన గురువారం ఉదయం నుండి సాయంత్రం వరకూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఎఎంసి తన గని నుంచి తవ్విన దాని కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ మొత్తంలో ఖనిజాన్ని విదేశాలకు ఎగుమతి చేసిందని ఆరోపణలు ఉన్నాయి.

అలీఖాన్ వాంగ్మూలంలో కూడా ఇది రుజువైందని తెలుస్తోంది. కాగా సిబిఐ అదుపులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డి హాయిగా ఉండగా, అలీఖాన్ ఇబ్బంది పడుతున్నారట. విచారణలో పాల్గొనడాన్ని గాలి దైనందిన జీవితంలో ఓ భాగంగా భావిస్తున్నారట. లేవగానే కాలకృత్యాలు తీర్చుకోవడం, ధ్యానం, యోగాభ్యాసాలు, టిఫిన్, పేపర్లు చదవడం ఆయన చేస్తున్నారు. కాగా గాలి, అలీఖాన్ కస్టడి ముగియనుండటంతో సిబిఐ విచారణను తీవ్రతరం చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+