17 ఉప ఎన్నికల్లో జగన్‌కు మద్దతివ్వం: రాఘవులు

రాష్ట్రంలో జరుగుతున్న ఉప ఎన్నికలు జాతీయ, రాష్ట్ర రాజకీయాలను శాసించేవి కాదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధోగతి పాలైందని, తెలంగాణ సమస్యను సృష్టించి, దానిని పరిష్కరించలేకపోవటంతో ఉప ఎన్నికల్లో ఆ పార్టీకి శృంగభంగం తప్పదని స్పష్టం చేశారు. 2009లో తాము సమైక్యాంధ్రకు, సిపిఐ తెలంగాణకు మద్దతు పలికినా ఎన్నికల్లో కలిసే పని చేశామని, టిడిపి ఒకవైపు తెలంగాణ, మరోవైపు సమైక్యాంధ్ర అని ప్రకటించినా ఆ పార్టీతో కలిసి పనిచేశామని, అందువల్ల, సిపిఐతో సర్దుబాట్లకు తెలంగాణ అంశం ఆటంకం కాదని స్పష్టం చేశారు. పత్తి ఎగుమతులకు సంబంధించి బహుళజాతి కంపెనీలకు అనుగుణంగానే కేంద్రం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజల అసంతృప్తిని ఉద్యమాల దిశగా మళ్లించడంపైనే తాము దృష్టి సారించామని, ప్రత్యామ్నాయం గురించి ఆలోచించడం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications