సైకిల్‌దే హవా: కెసిఆర్,జగన్‌పై ఒంటికాలిపై లేచిన బాబు

chandrababu naidu
నిజామాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఆదివారం విరుచుకు పడ్డారు. నిజామాబాద్ జిల్లాలో ఆయన ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తెలంగాణకు తాను ఎప్పుడు వ్యతిరేకంగా మాట్లాడలేదని మాట్లాడబోనని బాబు స్పష్టం చేశారు. తెలంగాణను తేల్చాల్సింది కేంద్రమేనని చెప్పారు. ప్రస్తుత అనిశ్చితిని తొలగింప చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నుండి డబ్బులు వస్తున్నాయి కాబట్టే కెసిఆర్ ఆమెకు విధేయత ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. కెసిఆర్‌కు తన కుటుంబం వ్యాపకం తప్ప మరొకటి లేదన్నారు. సోనియాను చూస్తే ఆయనకు వణుకు అన్నారు. నా దగ్గర బతికిన వ్యక్తి ఇప్పుడు బొంద పెడతానని అంటున్నాడని కెసిఆర్ పైన మండిపడ్డారు. తెలంగాణ త్యాగాలు అమ్ముకున్న వ్యక్తి కెసిఆర్ అని మండిపడ్డారు.

వైయస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని గులాం గిరి చేస్తున్నారని అన్నారు. జగన్ అవినీతి రాజా అయితే కెసిఆర్ వసూల్ రాజా అన్నారు. టిడిపి జోలికొస్తే మాడి మసైపోతావని కెసిఆర్‌ను హెచ్చరించారు. కెసిఆర్‌కు నన్ను గాని, టిడిపిని గాని విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. అవకాశవాద రాజకీయాలు చేస్తున్న కెసిఆర్ వద్దకు గంప గోవర్ధన్ వెళ్లాడని ఆయనకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. రాజకీయ జన్మనిచ్చిన పార్టీకి గంప గోవర్ధన్ ద్రోహం చేశారన్నాడు. కెసిఆర్ కు మంత్రి పదవి ఇచ్చి ఉంటే పార్టీ పెట్టే వాడు కాదన్నారు. వ్యవసాయం లాభ సాటి అయ్యే వరకు టిడిపి రైతులకు అండగా ఉంటుందన్నారు. కాంగ్రెసు పార్టీ దొంగలు రాబందుల్లా ప్రజా సంపదను మెక్కేశారన్నారు. యుపిలో సైకిల్ గెలిచిందని, భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలదే హవా అన్నారు.

2002లో గోద్రా అల్లర్ల సమయంలోనే తాను బిజెపికి మద్దతు ఉపసంహరించుకుంటే ముస్లింలలో తాను చిరస్థాయిగా నిలిచి పోయేవాణ్ణని అన్నారు. టిడిపి అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు రూ.1000 భృతి ఇస్తుందన్నారు. గల్ఫ్ బాధితులకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయిస్తామని చెప్పారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్సుమెంట్స్ పూర్తిస్థాయిలో అమలు చేస్తామని చెప్పారు. కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పని చేసిన కెసిఆర్ బీడీ కార్మికుల బతుకులతో చెలగాటమాడాటారని, ఆయన హయాంలోనే బీడీ కట్టలపై పుర్రె గుర్తు ముద్రించారని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+