బెంగళూరులో జగన్‌కు శ్వేతసౌధం: మంత్రి ఆనం సెటైర్

జగన్‌కు తమ పార్టీని, పార్టీ నేతలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు. జగన్ విమర్శలను ఆయన తప్పు పట్టారు. లక్ష కోట్లు సంపాదించిన జగన్ బెంగళూరులో శ్వేత సౌధాన్ని నిర్మించారని ఎద్దేవా చేశారు. నెల్లూరు జిల్లాకు మొదటిసారిగా నాటు బాంబుల సంస్కృతి తీసుకు వచ్చింది తాజా మాజీ పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డిని, ఊసరవెల్లిలా పార్టీలు మారుస్తున్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పక్కన పెట్టుకొని జగన్ నీతులు చెప్పడం విడ్డూరం, సిగ్గుచేటు అన్నారు. కొవూరులో కాంగ్రెసు ఘన విజయం సాధించడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications