లెక్కలంటే భయం, బలవంతం చేయవద్దు: చిరంజీవి

Chiranjeevi
హైదరాబాద్: తనకు చిన్నప్పటి నుండి గణితమంటే ఎంతో భయమని, సైన్స్ చాలా ఇష్టమని తిరుపతి శాసనసభ్యుడు, కాంగ్రెసు పార్టీ నేత చిరంజీవి ఆదివారం అన్నారు. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ మొదటి వార్షికోత్సవం కార్యక్రమం గచ్చిబౌలిలోని బ్రహ్మ కుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తనకు గణితమంటే భయమన్నారు. ఉపాధ్యాయులు బోధించే విధానంతోనే పిల్లలకు ఆయా విషయాలపై ఇష్టం ఏర్పడుతుందని అన్నారు. తల్లిదండ్రులు తమ అభిప్రాయాలను పిల్లలపై రుద్దవద్దని ఆయన హితవు పలికారు.

చిన్న పిల్లల ఆసక్తిని గమనించి ఆ రంగంలో వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు సూచించారు. అలా చేస్తే పిల్లలు భవిష్యత్తులో అద్భుతాలు సృష్టించే అవకాశముందన్నారు. విద్యార్థుల భవిష్యత్తు తరగతి గదులతోనే ముడివడి ఉందనే విషయం ఉపాధ్యాయులు గుర్తుంచుకోవాలన్నారు. విద్యార్థులు మంచి మార్గంలో నడవాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల చొరవ ఉండాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+