చిరంజీవికి పవన్ కల్యాణ్ నిజంగానే దూరమయ్యాడా!?

అయితే అభిమానుల ఆందోళనను గమనించిన చిరంజీవి స్పందిస్తూ.. మీరంతా పవన్ గురించి ఆలోచిస్తున్నారని తెలుసునని, అయితే గబ్బర్ సింగ్ స్పెషల్ ఎఫెక్ట్స్ కోసం పవన్ అమెరికా వెళ్లారని వివరణ ఇచ్చారు. ఉదయమే పవన్ చెర్రీకి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. ఈ పంక్షన్‌ను మొదట నాలుగో తారీఖున అనుకున్నామని, అదే రోజు అయితే పవన్ వచ్చే వారని కానీ అనుకోకుండా అమెరికా వెళ్లారన్నారు. రామ్ చరణ్ కూడా మీరంతా పవన్ కోసం చూస్తున్నారని తెలుసునని ఆడియో ఫంక్షన్ డేట్ చేంజ్ కావడం వల్లనే రాలేక పోయారని అభిమానులకు చెప్పారు. అయితే నిన్న పవన్ సినిమా ఆడియో ఫంక్షన్‌కు చిరంజీవి కుటుంబ సభ్యులు రాకపోవడం, ఇప్పుడు చెర్రీ ఆడియో ఫంక్షన్‌కు పవన్ దూరంగా ఉండటం అందరిలోనూ అనుమానాలు రేకెత్తిస్తుంది. మరి చిరు, చెర్రీ చెప్పినట్లుగా అనుకోకుండా డేట్ చేంజ్ కావడం వల్లనే రాలేదా లేదా తన అభిమానులే తన కుటుంబ సభ్యులు అని పవన్ సరిపెట్టుకోవాల్సి వస్తుందా చూడాలి!












Click it and Unblock the Notifications