వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎర్రబెల్లి అరెస్టు: 14 రోజుల రిమాండ్, కోర్టు వద్ద ఉద్రిక్తత

By Srinivas
|
Google Oneindia TeluguNews

Errabelli Dayakar Rao
వరంగల్: తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు ఎర్రబెల్లి దయాకర రావును పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఆయనను జఫర్‌గడ్‌లో పోలీసులు అరెస్టు చేశారు. అక్కడి నుండి ఆయనను వరంగల్ కోర్టుకు తరలించారు. కోర్టు ఆయనకు రెండు వారాలు రిమాండ్ విధించింది. కోర్టు ఆయనకు బెయిల్‌ను నిరాకరించింది. కాగా ఎర్రబెల్లిని కోర్టుకు హాజరు పర్చే సమయంలో కోర్టు ప్రాంగణంలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఆతనిని లోనికి తీసుకు వెళ్లే సమయంలో తెలంగాణ న్యాయవాదులు అడ్డుకున్నారు. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. ఎర్రబెల్లికి వ్యతిరేకంగా స్లోగన్స్ ఇచ్చారు. దీంతో లాయర్లు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. తర్వాత పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు. అనంతరం పోలీసులు ఆయనను కోర్టులో హాజరుపర్చడంతో కోర్టు ఆయనకు రిమాండ్ విధించింది.

నాలుగు రోజుల క్రితం ఎర్రబెల్లి దయాకర రావు పోలీసులపై దురుసుగా ప్రవర్తించినందుకు పోలీసులు అతనిని అరెస్టు చేశారు. మార్చి ఏడవ తేదిన ఎర్రబెల్లి జఫర్‌గడ్ ఎస్‌ఐతో వాగ్వాదానికి దిగారు. అతనిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో ఎర్రబెల్లిపై విధులకు ఆటంకం కలిగించారని కేసు నమోదు చేశారు.

English summary
Warangal Police arrested TDP senior leader Errabelli Dayakar Rao today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X