దూరం అంటే సై: కెసిఆర్‌కు రేవంత్, కొత్తకోట సవాల్

జిల్లాకు చెందిన మరో నేత రేవంత్ రెడ్డి కూడా కెసిఆర్‌కు సవాల్ విసిరారు. చంద్రబాబు నాయుడును విమర్శించే కెసిఆర్‌కు పాలమూరులో సొంత ఊరు లేదు.. పార్లమెంటులో నోరు లేదని ఎద్దేవా చేశారు. ఉప ఎన్నికలతో తెలంగాణ రాకుంటే కెసిఆర్ తన పార్టీని ఎన్నికలకు దూరంగా ఉంచుతారా అని సవాల్ విసిరారు. తెలంగాణ రాకుంటే టిఆర్ఎస్ ఏ ఎన్నికల్లో పోటీ చేయవద్దన్నారు. దానికి కెసిఆర్ సిద్దపడితే తాను కూడా తెలంగాణ వచ్చే వరకు ఎన్నికల్లో పోటీ చేయనని అన్నారు. కెసిఆర్‌కు ఉప ఎన్నికలు ఉపాధి హామీ పథకం వంటివన్నారు. ఉద్యమం ముసుగులో ఉపాధి హామీ అమలు చే్స్తున్నారన్నారు. నీవు పాలమూరులో మమ్మల్ని సవాల్ చేయడమేమిటన్నారు.












Click it and Unblock the Notifications