చిరంజీవితో పోటీ లేదు: రాజ్యసభ సీటుపై వైయస్ వివేకా

ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెసులో విలీనం చేసినప్పుడు రాజ్యసభకు తీసుకుని చిరంజీవికి కేంద్ర మంత్రి ఇస్తామని హామీ ఇచ్చి ఉండవచ్చునని, తాను రాజ్యసభ సీటు అడగానికి మధ్య ఏ విధమైన సంబంధం లేదని ఆయన అన్నారు. చిరంజీవికి ఇచ్చిన హామీకి, తన ప్రయత్నాలకు మధ్య పోటీ పెట్టాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తనను పార్టీ వాడుకుందనే వాదన నిజం కాదని, పార్టీ కల్పించిన అవకాశాల వల్లనే తాను ఈ స్థాయిలో ఉన్నానని ఆయన అన్నారు. రాజ్యసభ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న వైయస్ వివేకానంద రెడ్డి ఢిల్లీలోనే మకాం వేశారు. పదిహేనేళ్ల నుంచి రాయలసీమకు గానీ, కడప జిల్లాకు గానీ రాజ్యసభ సీటు ఇవ్వలేదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications