ఓట్లమ్ముకున్న చరిత్ర: కెసిఆర్‌పై బాబు, కాంగ్రెస్‌పైనా ఫైర్

టిడిపిని ఏమైనా అంటే కాంగ్రెసు అడ్రస్ లేకుండా పోతుందన్నారు. రాష్ట్రానికి కాంగ్రెసు పాలన ఓ శాపం అన్నారు. అదిలాబాద్ టిడిపి హయాంలోనే అభివృద్ది చెందిందని, దీనిపై కాంగ్రెసు బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎంపిగా, మంత్రిగా కెసిఆర్ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. ఆయన హయాంలోనే పుర్రె గుర్తు వచ్చి, బీడి కార్మికుల పొట్ట కొట్టిందన్నారు. టిఆర్ఎస్‌కు నీతి నియమాలు లేవన్నారు. ఎన్నికల పేరుతో కెసిఆర్ డబ్బులు దండుకుంటున్నారని విమర్శించారు. తన హయాంలోనే ఐటి అభివృద్ధి అన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందటం లేదన్నారు. కాంగ్రెసు నేతలు దోచుకుంటూ రాజ్యమేలుతున్నారన్నారు. ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపాలన్నారు. కెసిఆర్‌కు నోటు, సీటుకు తప్ప అభివృద్ధి పట్టదన్నారు. కాగా చంద్రబాబు తెలుగుదేశం పార్టీ నేత ఎర్రబెల్లి దయాకర రావును పరామర్శించేందుకు వరంగల్ బయలుదేరి వెళ్లారు.












Click it and Unblock the Notifications