రూ.25 లక్షలు డిమాండ్ చేసిన ఎమ్మెల్యే కవిత?

ఇక హన్మకొండ మాజీ డిఎస్పీ వీరేశ్వరరావు, సుబేదారి సిఐ రణధీర్, ఖాజీపేట సిఐ విజయసారథి... మోహన్ రెడ్డి సిండికేట్ నుంచి నెలవారీ మామూళ్లు అందుకున్నారని రిమాండ్ రిపోర్టులో తెలిపినట్లుగా తెలుస్తోంది. ఆదిలాబాద్ ఓఎస్‌డి ఉమామహేశ్వరరావు, సిఐ శ్రీధర్ రావు... రమేశ్ రెడ్డి ద్వారా నెలకు 20వేల చొప్పున ముడుపులు అందుకున్నారని, కొన్ని నెలలు రూ.30వేలు కూడా తీసుకున్నారని వివరించింది. గతంలో మామునూరు డిఎస్పీగా పనిచేసిన వెంకటేశ్వరరావు పవన్ సిండికేట్ నుంచి నెలకు పాతికవేల చొప్పున రెండుసార్లు, 30వేల చొప్పున మూడుసార్లు మామూళ్లు తీసుకున్నట్లు ఎసిబి గుర్తించింది. వెంకటేశ్వరరావును శనివారం ఎసిబి అధికారులు ప్రశ్నించి వదిలివేశారు. వరంగల్ జిల్లాలో పనిచేసిన డిఎస్పీ జోగయ్య, సిఐలు శోభన్ కుమార్, వెంకటేశ్వర బాబులను సైతం ఎసిబి అధికారులు విచారించినట్లు సమాచారం. వీరిని కూడా అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలిసింది. మద్యం సిండికేట్ల నుంచి స్వాధీనం చేసుకున్న చిట్టాల ఆధారంగా నెలవారీ ముడుపులు తీసుకున్న పోలీసు అధికారుల జాబితాను ఎసిబి అధికారులు ఇప్పటికే సిద్దం చేశారు.












Click it and Unblock the Notifications