జాతకాలు చెప్పే లగడపాటి ఒక్క పైసా తేలేదు: దేవినేని

మరోనేత పయ్యావుల కేశవ్ మంత్రుల పైన మండిపడ్డారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో సుప్రీం కోర్టు నోటీసులు అందుకున్న మంత్రులు అప్రూవర్లుగా మారాలని సూచించారు. వివాదాస్పద జివోలు జారీ చేయడంలో ఎవరి ఒత్తిడి ఉందో వారు సిబిఐ ఎదుట వెల్లడించాలన్నారు. సామాన్యుడికి అందుబాటులో ఉండే వివరాలు శాసనసభలో పెట్టకుండా అధికార పార్టీ అసెంబ్లీని అవమానపరుస్తోందన్నారు. ఆ ఫైళ్లు పాలకుల ఆస్తి కాదని ప్రజల ఆస్తి అన్నారు. సభలో ఫైళ్లు పెడితే ప్రభుత్వం కూలిపోతుందనే భయంతోనే వెనుకడుగు వేస్తున్నారన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు ఇదే విధంగా వ్యవహరిస్తే ఇక జైళ్లోనే మాజీ మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications