బెంగళూరులో పెనుగొండ కాళేశ్వర్ బాబా మృతి

కాగా కాళేశ్వర బాబా చనిపోయారనే వార్తల నేపథ్యంలో ఆశ్రమానికి భారీగా భక్తులు చేరుకుంటున్నారు. బాబాపై పలు ఆరోపణలు ఉన్నాయి. భూకబ్జాలు, గనుల తవ్వకాల అంశాల్లో ఆరోపణలు ఉన్నాయి. ఇంటర్ తర్వాత బాబా అవతారం ఎత్తారు. మంత్రి రఘువీరా రెడ్డి బాబాను బుధవారం ఆసుపత్రిలో పరామర్శించారు. బాబా వయస్సు 38 ఉంటుంది. ఇతను కాళేశ్వర్ సమర్థ మహారాజ్‌గా పేరుగాంచారు.
కాగా మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో కొలంబియా ఆసుపత్రి వర్గాలు కాళేశ్వర్ బాబా మృతిని ధృవీకరించాయి. బాబా మృతదేహాన్ని బెంగళూరు నుండి పెనుగొండకు తరలించనున్నారు. శనివారం అంత్యక్రియలు జరగనున్నాయి. బాబాది కడప జిల్లాకు చెందిన మాధవవరం. ఇతను అదే జిల్లాకు చెందిన శిల్పను వివాహం చేసుకున్నారు. వీరికి నవ్యశ్రీ అనే మూడేళ్ల కూతురు ఉంది. బాబా అసలు పేరు సుబ్రహ్మణ్యం. కాగా అతను కిడ్నీ సంబంధ వ్యాధితో బాధ పడలేదని, లివర్ సంబంధ వ్యాధితో బాధపడ్డారని అంటున్నారు.












Click it and Unblock the Notifications