వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముఖ్యమంత్రిగా అఖిలేష్ యాదవ్ ప్రమాణం, రికార్డ్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Akhilesh Yadav
లక్నో: ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా యువ కెరటం అఖిలేష్ సింగ్ యాదవ్ గురువారం ఉదయం లక్నోలో ప్రమాణ స్వీకారం చేశారు. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రానికి పిన్న వయస్కుడైన(38) ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇతను యుపికి 33వ సిఎం. అఖిలేష్‌తో పాటు అజంఖాన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అఖిలేష్ యాదవ్ కేబినెట్‌లో ప్రస్తుతానికి 19 మందికి స్థానం కల్పించారు. మంత్రివర్గంలో యువతకు, సీనియర్లకు సమానంగా ప్రాధాన్యం కల్పించారు. సమాజ్‌వాది పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ సింగ్‌కు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, అభిమానులు, కార్యకర్తలు తరలి వచ్చారు.

ఈ యువనేత ఎన్నిలకు ముందు నుండే పార్టీని ప్రక్షాళన చేస్తూ వచ్చారు. అలాగే ఎన్నికల్లో ప్రజలకు చాలా ప్రమాణాలు చేశారు. విద్యార్థులకు లాప్‌టాప్‌లు, నిరుద్యోగ భృతి, ఉచిత వైద్యం తదితర మేనిఫెస్టో హామీలను ఎంత వరకు నెరవేర్చుతారో చూడాలి. పార్టీలో టిక్కెట్ల కేటాయింపు నుండి ఇప్పటి వరకు ములాయం సింగ్ యాదవ్ పూర్తి అధికారాలను అఖిలేష్‌కే ఇచ్చారు.

English summary
SP leader Akhilesh Yadav took oath as the chief minister of Uttar Pradesh on Thursday for the first time, after his party gained absolute majority by winning 224 seats in the 403-member assembly.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X