రాసలీలల సీడిల్లో మేం కాదు: రంజితతో నిత్యానంద

తమను ఇరికిస్తూ రూపొందించిన సీడిలను తాము కోర్టుకు సమర్పిస్తామని ఆయన చెప్పారు. తమను డబ్బులు డిమాండ్ చేసినవారు నేరాలు అంగీకరించినట్లు ఆయన తెలిపారు. మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న నటి రంజిత తీవ్ర ఆగ్రహంతోనే ఉన్నారు. చాలా కాలం తెర వెనక ఉండిపోవడానికి కారణం ఏమిటని అడిగితే తాను మహిళను, పబ్లిక్ ఫిగర్‌ను, మంచి నటిగా ఎదుగుతున్న సమయంలో అశ్లీల సీడీలో తనను ఇరికించారని, అందుకే అజ్ఞాతంలో ఉండిపోవాల్సి వంచిందని ఆమె చెప్పారు.
నిత్యానంద తనకు గురువు, దైవం మాత్రమే కాకుండా జీవితాన్ని ప్రసాదించిన మహోన్నత వ్యక్తి అని, రక్షణ కోసం అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలని తామే చెప్పామని ఆమె అన్నారు. గత ప్రభుత్వ కాలంలో ఎందుకు ముందుకు రాలేదని అడిగితే, అప్పటి ముఖ్యమంత్రి కరుణానిధిపై తమకు నమ్మకం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications