బడ్జెట్ 2012: పార్లమెంటుకు చేరుకున్న ప్రణబ్

టాక్స్ బ్రాకెట్స్‌పై ఆదాయం పన్ను పరిమితిని 10, 20, 30 శాతం పెంచవచ్చునని అంటున్నారు. చౌక ధర ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే 15 లక్షల రూపాయల రుణంపై ఒక శాతం వడ్డీ విధించే అవకాశాలున్నాయి. లగ్జరీ సరుకులపై సుంకాలను పెంచే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ప్రణబ్ ముఖర్జీ కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవచ్చునని చెబుతున్నారు. గురువారం పార్లమెంటు ముందు ఉంచిన ఆర్థిక సర్వే కూడా ఈ విషయాన్ని సూచిస్తోంది. ప్రణబ్ ముఖర్జీ బడ్జెట్‌కు కేంద్ర మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.












Click it and Unblock the Notifications