సునీల్ రెడ్డి కంపెనీల రూ. 45 కోట్లు తేలాల్సిందే: సిబిఐ

సునీల్ తరపున సుప్రీం న్యాయవాది సుశీల్ కుమార్ వాదిస్తూ.. "తుమ్మల రంగారావుకు ఏ నిబంధనల ప్రకారం బెయిల్ మంజూరు చేశారో వాటి ప్రకారమే మా క్లయింట్‌కు బెయిల్ ఇవ్వాలి. కొన్ని కంపెనీల నుంచి 2007లో సునీల్ రూ.45 కోట్లు స్వీకరించారని అంటున్నారు. అంత డబ్బు ఏమైందో మాత్రం చెప్పలేదు. అంత డబ్బును ఎవరూ ఇంట్లో పెట్టుకోరు కదా! సీబీఐ ఆ వివరాలను ఎందుకు చెప్పలేదు'' అని అన్నారు.
"సునీల్ డైరెక్టరుగా ఉన్న సౌత్ ఎండ్ ప్రాజెక్ట్సులోకి 10 కంపెనీల నుంచి రూ.45 కోట్లు వచ్చాయి. అవి వ్యాపార కార్యకలాపాలు నిర్వహించినవి కాకపోవడం అనుమానాలు రేపుతోంది. అదే కంపెనీలో డైరెక్టరుగా ఉన్న మనోహర్ రెడ్డి సీబీఐ దర్యాప్తు తీరును అనుమానిస్తూ కోర్టులో పిటిషన్ వేశారు. దీనినిబట్టి, వీరిద్దరి మధ్య కొంత వ్యవహారం నడిచినట్లు తెలుస్తోంది. దీనిపై దర్యాప్తు చేస్తున్నాం. ఈ దశలో సునీల్‌కు బెయిల్ ఇవ్వొద్దు'' అని అన్నారు. వాదనలు పూర్తవడంతో జడ్జి తీర్పును సోమవారానికి వాయిదా వేశారు.
తనపై నమోదు చేసిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ ఎమ్మార్ కేసు నిందితుడు తుమ్మల రంగారావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై విచారణను సీబీఐ కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కేసులు ఎత్తివేస్తే తాను అప్రూవర్‌గా మారతానని ఆయన కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో వాదనలు వినిపించేందుకు డిఫెన్స్ న్యాయవాది సమయం కోరడంతో న్యాయమూర్తి అందుకు ఆమోదం తెలిపారు. ఇదే కేసులో నిందితుడు కోనేరు ప్రసాద్ రిమాండ్‌ను మార్చి 30కి పొడిగించారు.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications