భాను కిరణ్ రాజస్థాన్‌లో తల దాచుకున్నాడా?

భాను కిరణ్ ఆచూకీపై ఎప్పటికప్పుడు ఊహాగానాలు ప్రచారమవుతూనే ఉన్నాయి. తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు, తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నట్లు కూడా ప్రచారాలు సాగాయి. సూరిని హత్య చేసిన తర్వాత ఢిల్లీకి పారిపోయి ఓ చిన్నపాటి లాడ్జిలో ఉన్న భాను అక్కడి నుంచి పారిపోయి వివిధ ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు చెబుతున్నారు. భాను కిరణ్ తన కుటుంబ సభ్యులకు ఫోన్లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారని చెబుతున్నారు. అలాగే, రాష్ట్రంలోని ఇద్దరు మిత్రులతో కూడా మాట్లాడుతున్నట్లు తెలుస్తోందంటూ ఆ టీవీ చానెల్ తెలిపింది. ఆ సంభాషణల ఆధారంగానే భాను కిరణ్‌ను పట్టుకోవడానికి పోలీసులు రాజస్థాన్ బయలుదేరినట్లు ఆ టీవీ చానెల్ తెలిపింది.












Click it and Unblock the Notifications