టిటిడి పాలనా భవనంలో హత్య: అక్రమ సంబంధం వల్లే

Tirumala Temple
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) పరిపాలనా భవనంలో శనివారం దారుణ హత్య చోటు చేసుకుంది. దీంతో టిటిడి ఉద్యోగులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ సంఘటన తీవ్ర సంచలనానికి కారణమైంది. టిటిడి సీనియర్ అసిస్టెంట్ మల్లికార్జున్‌ను దుండగులు కత్తులతో పొడిచి హత్య చేశారు. అతను లోనికి ప్రవేశిస్తుండగా దాడి చేసి హత్య చేశారు. టిటిడి కార్యాలయంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడం ఇదే ప్రథమం

కుటుంబ కలహాల వల్లనే మల్లికార్జున్ హత్యకు గురైనట్లు అనుమానిస్తున్నారు. మల్లికార్జున్‌కు ఓ మహిళతో ఉన్న వైవాహేకేతర సంబంధంతో ఆగ్రహించిన మహిళ తరఫు బంధువులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని చెబుతున్నారు. మల్లికార్జున్ తన సహోద్యోగినితోనే అక్రమ సంబంధం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆ మహిళ తరఫు బంధువులు ఈ దారుణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆ మహిళ భర్త శ్రీనివాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+