ములాయం క్యాంప్‌లోకి జయాబచ్చన్: అంబానీ వల్లే

అమితాబ్ కుటుంబంతో ఎస్పీ సంబంధాల పునరుద్ధరణలో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ప్రమాణస్వీకారానికి అంబానీ, జయా బచ్చన్ గురువారం లక్నోకు వెళ్లినట్లు చెబుతున్నారు. అమర్ సింగ్ మినహా మిగతావారిని ములాయం సింగ్ చేరదీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. జయా బచ్చన్ బయటకు వెళ్లలేదని, ఆమె పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలని, గతంలో ఆమె నామినేషన్‌ను వేయడానికి నిరాకరించారని, ఇప్పుడు అంగీకరించారని ఎస్పీ అధికార ప్రతినిధి రాజేంద్ర చౌదరి అన్నారు.












Click it and Unblock the Notifications