ఒబామా హత్యకు లాడెన్ ప్లాన్: వెల్లడించిన పత్రాలు

అఫ్ఘనిస్థాన్‌లో అంతర్జాతీయ దళాలకు నాయకత్వం వహించిన డేవిడ్ పెట్రెయస్‌ని కూడా చంపేందుకు లాడెన్ ఆదేశాలు జారీ చేసినట్లు ఆ పత్రాలు తెలియజేస్తున్నాయని వార్తలు వచ్చాయి. వాషింగ్టన్ పోస్టులో ఇందుకు సంబంధించిన వార్త ప్రచురితమైంది. ఆ పత్రాల ప్రకారం - ఒబామాను, పేట్రియాస్‌ను చంపితే జో బిడెన్ అధ్యక్షుడవుతాడని, తమ యుద్ధానికి బిడెన్ సన్నద్ధంగా లేరని, దీంతో మొత్తం పరిస్థితి మారిపోతుందని లాడెన్ తన అనుచరగణాలకు వివరించాడని సమాచారం. అబొత్తాబాద్‌లోని లాడెన్ నివాసం నుంచి స్వాధీనం చేసుకున్న పత్రాలను త్వరలో అరబిక్‌లో, ఆంగ్లానువాదంలో వెల్లడించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.












Click it and Unblock the Notifications