రాజ్యసభకు చిరంజీవి: కాంగ్రెసుకు మెగా చాన్స్ మిస్?

అదే విషయంపై ప్రశ్నిస్తే - ఆ విషయంపై తనకు వ్యక్తిగతాభిప్రాయం లేదని, సోనియా గాంధీ ఏది చెప్తే తాను అది చేస్తానని, తన భవిష్యత్తు సోనియా చేతులో ఉందని, కథ ముగిసిందని ఎందుకు అనుకుంటున్నారని, సోనియా అడిగితే 2014 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని చిరంజీవి అన్నారు. చిరంజీవి చెప్పినట్లు వచ్చే ఎన్నికల్లో ఆయనను రాష్ట్ర రాజకీయాల్లోకి దింపే అవకాశాలు కూడా ఉంటాయని అంటున్నారు. తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసుల నుంచి ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడానికి చిరంజీవి ఢిల్లీలో తమకు అందుబాటులో ఉండడమే మంచిదని కాంగ్రెసు అధిష్టానం భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీలో ఉండే కన్నా తమ నాయకుడు ఇక్కడ ఉంటే ఎక్కువ ప్రయోజనం నెరవేరుతుందని గత ప్రజారాజ్యం పార్టీ నాయకులు కూడా అంటున్నారు.












Click it and Unblock the Notifications