వచ్చే ఉప ఎన్నికలకు అప్పుడే ముఖ్యమంత్రి కసరత్తు

మంగళవారం సాయంత్రం కిరణ్ కుమార్ రెడ్డి శ్రీకాకుళం, వరంగల్, కర్నూలు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాల మంత్రులు, శాసనసభ్యులతో సమావేశమయ్యారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గానికి మంత్రి టిజి వెంకటేష్‌ను, ఆళ్లగడ్డ నియోజకవర్గానికి ఏరాసు ప్రతాప రెడ్డిని ఆయన ఇంచార్జీగా నియమించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం బాధ్యతలను పితాని సత్యనారాయణకు పోలవరం నియోజకవర్గం బాధ్యతలను వట్టి వసంతకుమార్‌కు అప్పగించారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట నియోజకవర్గం బాధ్యతలను మంత్రి ధర్మాన ప్రసాదరావుకు అప్పగించారు. ఈ నెలాఖరున 17 స్థానాలకు కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను ప్రకటించడానికి కసరత్తు జరుగుతోంది.












Click it and Unblock the Notifications