మగబిడ్డకు జన్మనిచ్చిన ఐఏఎస్‌ నరేంద్ర కుమార్ భార్య

Narendra Kumar Singh
న్యూఢిల్లీ: ఇసుక మాఫియా చేతిలో హతమైన ఐపిఎస్ అధికారి నరేంద్ర కుమార్ సింగ్ భార్య మధురాణి సోమవారం ఓ బాలుడికి జన్మనిచ్చింది. న్యూఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా హాస్పిటల్‌లో ఆమె మగబిడ్డకు ఉదయం పదిన్నర గంటలకు జన్మనిచ్చింది. మధురాణి ఐఏఎస్ అధికారిణి. 2000 సంవత్సరం బ్యాచ్‌కు చెందిన ఈమె గ్వాలియర్‌లో విధులు నిర్వహిస్తున్నారు. భర్త చనిపోయిన సమయంలో ఆమె ప్రసూతి సెలవులోనే ఉన్నారు. మధురాణి డెలివరీ గురువారం కావాల్సి ఉండగా ముందుగానే అయిందని వైద్యులు చెప్పారు. కాగా తన భర్త హత్య కేసును సిబిఐచే విచారణ జరపాలని మధురాణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయంలో జ్యూడిషియల్ విచారణకు ఆదేశించింది.

కాగా ఇటీవల నరేంద్ర కుమార్ మైనింగ్ మాఫియా చేతిలో హతమైన విషయం తెలిసిందే. మోరెనా జిల్లా బామోర్ సబ్ డివిజనల్ పోలీసు ఆఫీసర్ నరేంద్ర కుమార్ అక్రమంగా కొట్టిన రాళ్లను రవాణా చేస్తున్న ట్రాక్టర్‌ను ఆపడానికి ప్రయత్నించారు. ట్రాక్టర్‌ను డ్రైవర్ ఆపకుండా అతని మీదుగా తోలాడు. వెంటనే ఆయనను ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లభించలేదు. నరేంద్ర హత్య వెనుక కుట్ర ఉందని, తన కోడలి ప్రాణాలకు కూడా ముప్పు ఉందని నరేంద్ర తండ్రి కేశవ్ దేవ్ ఆ తర్వాత ఆరోపించిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+