పెరుగుతున్న ఒత్తిడి: యడ్డీకి గాలి బ్రదర్స్ మద్దతు

యడ్యూరప్ప డిమాండ్‌ను విస్మరించలేని పరిస్థితి ప్రస్తుతం నెలకొని ఉంది. తాను ఢిల్లీకి వెళ్తే శాసనసభ్యులు జారిపోయే ప్రమాదం ఉందని భావించిన యడ్యూరప్ప అందుకు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది. రిసార్టులో ప్రస్తుతం 50 మంది శాసనసభ్యులు ఉన్నారు. ఆయనకు మద్దతిస్తున్న శాసనసభ్యుల సంఖ్య 70కి చేరినట్లు చెబుతున్నారు. యడ్యూరప్ప వర్గానికి చెందిన శాసనసభ్యులు మంగళవారం శాసనసభకు గైర్హాజరయ్యారు.
అయితే, రేపు బుధవారం సదానంద గౌడకు బడ్జెట్ ప్రతిపాదించే అవకాశం కల్పించాలని బిజెపి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ యడ్యూరప్పకు సూచించినట్లు తెలుస్తోంది. యడ్యూరప్ప పెట్టిన 48 గంటల గడువు మంగళవారం సాయంత్రం ముగుస్తుండడంతో గడ్కరీ ఆ సూచన చేసినట్లు తెలుస్తోంది. బిజెపి అధిష్టానానికి యడ్యూరప్ప గడువు పెట్టడం ఇది మూడోసారి.












Click it and Unblock the Notifications