డిఎల్ రాజీనామా: కిరణ్‌ రెడ్డిపై ఒత్తిడి పెంచేందుకే

Kiran Kumar Reddy-DL Ravindra Reddy
హైదరాబాద్: మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని టార్గెట్ చేశారు. ముఖ్యమంత్రిపై గత కొంతకాలంగా పూర్తి అసంతృప్తితో ఉన్న డిఎల్ రవీంద్రా రెడ్డి ఆయనపై పలుమార్లు విమర్శలు చేశారు. బుధవారం ఉప ఎన్నికల ఫలితాల అనంతరం కూడా ఆయన ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వారు తమ రాజీనామాలు ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీకి పంపించాలని డిమాండ్ చేశారు. అయితే ఆయన కేవలం డిమాండ్‌లతో సరిపెట్టకుండా సిఎంపై ఒత్తిడి పెంచే విధంగా వెళుతున్నారు. అందులో భాగంగానే ఆయన రాజీనామాగా కనిపిస్తోంది. ఏడు నియోజకవర్గాలలో ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన గురువారం మధ్యాహ్నం సోనియాకు లేఖ పంపారు. పిసిసి చీఫ్ బొత్స, ముఖ్యమంత్రి కిరణ్ ఓటమికి బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇది ఖచ్చితంగా కిరణ్ పైన ఒత్తిడి పెంచేందుకేనని అంటున్నారు.

ఇటీవల తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవి వర్గం నేతలను మంత్రివర్గంలోకి తీసుకున్న తర్వాత కిరణ్.. డిఎల్ శాఖలకు కోత పెట్టారు. అప్పటికే డిఎల్ ముఖ్యమంత్రి పట్ల పూర్తి అసంతృప్తితో ఉన్నారు. ఆ తర్వాత శాఖలలో కోత పెట్టడంతో డిఎల్ రగిలిపోయారు. దీంతో అప్పుడే అతను రాజీనామా చేసేందుకు సిద్ధపడ్డారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సర్ది చెప్పడంతో ఆయన అప్పుడు వెనక్కు తగ్గారు. ముఖ్యమంత్రిపై అప్పటి నుండే రగులుతున్న డిఎల్ అదును కోసం చూశారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఘోర వైఫల్యం చెందడంతో ఆయన దీనిని ఉపయోగించుకుంటున్నారని అంటున్నారు. ఆయన ఖచ్చితంగా మంత్రి పదవికి రాజీనామా చేయాలనుకుంటే గవర్నర్‌కు పంపించాల్సి ఉంది. కానీ ఆయన సోనియా గాంధీకి పంపడం విశేషం. అంటే అతను రాజీనామా చేసింది కిరణ్‌పై ఒత్తిడి పెంచేందుకేనని అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+