కిరణ్‌కు బాసట, సోనియాను పదవి అడగలేదని చిరు

పరస్పరం కాంగ్రెసు నాయకులు విమర్శలు చేసుకోవడం కొత్తేమీ కాదని, గతంలో కూడా ఈ సంప్రదాయం ఉందని ఆయన అన్నారు. తమ పట్ల విశ్వాసం పెరిగిందని, మరింత విశ్వాసం పొందడానికి అందరూ కష్టపడాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలో తమ పార్టీ కచ్చితంగా గెలుస్తుందని ఆయన అన్నారు. మొత్తం 18 స్థానాల్లో కాంగ్రెసు గెలుస్తుందని, అభివృద్ధే కాంగ్రెసును గెలిపిస్తుందని ఆయన అన్నారు. తాను సోనియాను మర్యాదపూర్వకంగానే కలిశానని, తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు తెలిపానని ఆయన చెప్పారు. తనకు పదవి కావాలని తాను అడగలేదని, అలా అడగడం తన నైజం కాదని ఆయన అన్నారు. సోనియా ఎలాై నిర్ణయిస్తారో చూడాలని ఆయన అన్నారు. పార్టీ బలోపేతానికి సోనియా నిర్దిష్టమైన సూచనలు చేసినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications