కూతురు జగన్ పార్టీలోకి సరే, నేను వెళ్లను: నన్నపనేని

దివంగత సీఎం వైఎస్‌కు తన అల్లుడు లతీఫ్ రెడ్డి దూరపు బంధువు అని, ఇదే క్రమంలో జగన్ కార్యాలయానికి తన కూతురు, అల్లుడు వెళ్లారని చెప్పారు. 'కూతురు వెళ్లింది కాబట్టి... నేనూ ఆ పార్టీలోకి వెళుతున్నానని అనుకుంటే ఎలా?' అని ప్రశ్నించారు. కుటుంబసభ్యులు వేర్వేరు పార్టీల్లో ఉన్న సందర్భాలు చాలా ఉన్నాయని రాజకుమారి వ్యాఖ్యానించారు. తన కుమార్తె వేరే పార్టీలోకి వెళ్లడం వింత కాదు కదా అని అన్నారు. 'అవినీతి ఆరోపణలున్న పార్టీ గెలిస్తే అది ప్రజల తప్పా? మా తప్పా? టీడీపీ మళ్లీ అధికారంలోకి వస్తుంది. చంద్రబాబు సీఎం అవుతారు' అని రాజకుమారి స్పష్టం చేశారు. తన కూతురికి, అల్లుడికి అవకాశం ఇవ్వాలని రెండు సార్లు చంద్రబాబును కోరానని, అయితే చంద్రబాబు నుంచి హామీ రాలేదని ఆమె చెప్పారు.












Click it and Unblock the Notifications