నేను తెలంగాణ ఆడబిడ్డనే: రేణుకా చౌదరి మాట

Renuka Chaudhary
న్యూఢిల్లీ: తాను తెలంగాణ ఆడబిడ్డనే అని రాజ్యసభకు ఎన్నికైన కాంగ్రెసు నాయకురాలు రేణుకా చౌదరి అన్నారు. రాజ్యసభకు ఎన్నికైన తర్వాత ఢిల్లీ వచ్చిన ఆమె శనివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తనకు అందరూ మిత్రులేనని ఆమె చెప్పుకున్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసినందుకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపేందుకు తాను ఢిల్లీ వచ్చినట్లు ఆమె తెలిపారు.

ఢిల్లీకి చేరుకున్న రేణుకా చౌదరికి కార్యకర్తలు ఘన స్వాగతం చెప్పారు. శనివారం ఆమె సోనియాను కలుసుకున్నారు. హర్యానాకు చెందినవారు రేణుకా చౌదరికి స్వాగతం చెప్పినవారిలో ఉన్నారు. తన అభ్యర్థిత్వాన్ని ఎవరూ వ్యతిరేకించలేదని, మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశాలు లేవని రేణుకా చౌదరి అన్నారు. కేంద్ర మంత్రివర్గంలో చోటుపై తనకు ఎటువంటి సమాచారం లేదని ఆమె అన్నారు. రాజ్యసభ సీటు తనకు పదవి కాదని, బాధ్యత అని ఆమె అన్నారు. సోనియా నాయకత్వంలో తామంతా సైనికుల్లా పనిచేస్తామని ఆమె చెప్పారు.

తెలంగాణ ఓ ఒక్కరి పేటెంటో కాదని ఆమె అన్నారు. క్లిష్ట సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చారని ఆయన అన్నారు. నిలదొక్కుకోవడానికే సమయం పడుతోందని ఆమె అన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి పనై పోయిందని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు ఇన్‌స్టంట్ కాఫీ కాదని, తాను తెలంగాణ కోసం పని చేస్తూనే ఉన్నానని ఆమె చెప్పారు. తెలంగాణ కోసం తాను ఏం చేస్తానో మంత్రి పదవి వచ్చిన తర్వాత చెప్తానని ఆమె అన్నారు. చిరంజీవి సినీ స్టార్ మాత్రమే కారని, పొలిటికల్ స్టార్ అని ఆమె అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+