• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

తల్లిని కత్తితో నరికిన ఉన్మాది తనయుడు, అరెస్టు

By Pratap
|

Son attacks mother with knife
వరంగల్: వరంగల్ జిల్లా మహబూబాబాద్‌లో శనివారం సాయంత్రం దారుణం చోటు చేసుకుంది. ఓ ఉన్మాది తనయుడు తల్లిని కత్తితో నరికాడు. ఖమ్మం జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన ఉపేంద్ర అనే మహిళ తన కుమారుడు బాలకృష్ణను మహబూబాబాద్ ఆస్పత్రికి తీసుకుని వచ్చింది. మానసిక నిపుణులతో చికిత్స చేయిస్తున్న క్రమంలో వారం వారం వచ్చినట్లే శనివారం కూడా వచ్చింది. ఈ సమయంలో తాను కొబ్బరిబొండాం తాగుతానని తల్లి ఉపేంద్రతో కుమారుడు బాలకృష్ణ చెప్పాడు. అందుకు తల్లి అంగీకరించి కొబ్బరి బొండాం దుకాణం వద్దకు కుమారుడితో కలిసి వచ్చింది.

కొబ్బరి బొండాలు ఉన్న చోట తల్లికి, కొడుకుకి మధ్య వాగ్వివాదం జరిగింది. ఈ సమయంలో బాలకృష్ణ కొబ్బరి బొండాలు నరికే కత్తితో తల్లిపై దాడి చేశాడు. దీంతో ఆ మహిళ తలకు, చేయికి గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రిలో చేర్చారు. బాలకృష్ణను స్థానికులు పట్టుకుని చితకబాది, చెట్టుకి కట్టేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. దాంతో పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. సైకో కావడం వల్లనే బాలకృష్ణ తల్లిపై దాడి చేశాడని అంటున్నారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A son has attacked his mother with knife at Mahabubabad of Warangal district.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more