వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జానా ఇంట్లో టి-ఎంపీల భేటీ, 'తెలంగాణ'పై వ్యూహ రచన

By Srinivas
|
Google Oneindia TeluguNews

jana reddy
హైదరాబాద్: తెలంగాణ కోసం వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలానికి చెందిన బోజ్యా నాయక్ ఆత్మహత్య నేపథ్యంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యులు ఆదివారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఎంపీలు వివేక్, బలరాం నాయక్, మందా జగన్నాథం, గుత్తా సుఖేందర్ రెడ్డి, రాజయ్య, శాసనమండలి సభ్యుడు ఆమోస్ తదితరులు హాజరయ్యారు. వారంతా కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. ఢిల్లీ వెళ్లి ప్రత్యేక రాష్ట్రం కోసం కేంద్రం, అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే యోచనలో వారు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ పార్లమెంటు సమావేశాలలోనే తెలంగాణ బిల్లు పెట్టాలని అధిష్టానాన్ని వారు డిమాండ్ చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఢిల్లీ వెళ్లి అధిష్టానంపై తెలంగాణ కోసం ఒత్తిడి తేవాలని, లేదంటే ఈ ప్రాంతంలో కాంగ్రెసు పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. బిజెపి, టిఆర్ఎస్‌లకు చెక్ చెబుతూ తెలంగాణకు అనుకూలంగా తీసుకోవాల్సిన ఆవశ్యకతను అధిష్టానానికి వారు వివరించాలని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.

కాగా ఎంపీలు సమావేశమైన మంత్రి జానా రెడ్డి నివాసం ముందు తెలంగాణ జాగృతి విద్యార్థి ఆందోళన నిర్వహించారు. జానా ఇంటిని ముట్టడించి జై తెలంగాణ నినాదాలు చేశారు. జానారెడ్డి వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేయాలని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేశారు. కాంగ్రెసు పార్టీ తెలంగాణ ప్రకటించేలా ఒప్పించాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టేలా ఒత్తిడి తేవాలని ఎంపీలను తెలంగాణ జాగృతి కార్యకర్తలు డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బోజ్యా నాయక్‌ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు.

భేటి అనంతరం గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ.. బోజ్యా మృతికి అందుబాటులో ఉన్న ఎంపీలం భేటీ అయి సంతాపం తెలిపామని చెప్పారు. ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. పార్లమెంటు సభ్యులుగా మా బాధ్యతగా మేం తెలంగాణ సాధన కోసం మా ప్రయత్నం చేస్తామన్నారు. తెలంగాణ ఆలస్యానికి ఎవరు బాధ్యులు అయినా ఆత్మహత్యలకు హామీలు ఇచ్చిన అన్ని పార్టీలది అన్నారు. ఈ విషయాన్ని పార్లమెంటు, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళతామని చెప్పారు. అందరి లక్ష్యం తెలంగాణ అన్నారు. అందుకోసమే మా పోరాటమన్నారు. తెలంగాణ సాధనే మా లక్ష్యమన్నారు. ఎవరి అజెండాతో మాకు సంబంధం లేదన్నారు. తెలంగాణ కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకు వస్తామని చెప్పారు.

English summary
Congress Party Telangana mps are planning to put 
 
 pressure on High Command about Telangana issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X