కుప్పకూలుతున్న పసిడి రేట్లు: నెలారంభం వేళ..
దేశంలో బంగారం, వెండి ధరలు తగ్గాయి. పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా డాలర్ విలువలోని హెచ్చుతగ్గుల నేపథ్యంలో తాజా పరిణామం చోటు చేసుకుంది. సాధారణంగా సంక్షోభ సమయాల్లో సురక్షిత పెట్టుబడులుగా పరిగణించే పసిడి, వెండి రేట్లు పెద్దగా పుంజుకోవట్లేదు. ఇది.. గోల్డ్ కొనుగోళ్లు, అమ్మకాలపై ప్రభావం చూపుతోంది. పెట్టుబడిదారుల్లో ఊగిసలాట ధోరణి కనిపిస్తోంది.
నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు సుమారు రూ. 1,50,067గా నమోదైంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ. 1,38,110 వద్ద ట్రేడ్ అయింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం రూ. 1,50,820, 22 క్యారెట్లు రూ. 1,38,260, 18 క్యారెట్లు రూ. 1,13,150గా నమోదైంది. ముంబైలో 24 క్యారెట్లకు రూ. 1,50,670, 22 క్యారెట్లు రూ. 1,38,110, 18 క్యారెట్లు రూ. 1,13,000గా ఉంది. చెన్నైలో మాత్రం వీటి ధర వ్యత్యాసం కనిపించింది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,53,830, 22 క్యారెట్లు రూ.1,41,010, 18 క్యారెట్లు రూ. 1,17,760గా రికార్డయింది.

వెండి ధర కిలో రూ. 2,49,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ముఖ్యంగా బంగారం కంటే వెండి ఆభరణాలు ఎక్కువగా లభించే ప్రాంతాలలో దీనికి మరింత ప్రాధాన్యత ఉంది. బంగారం మాదిరిగానే, వెండి ధరలు కూడా ప్రపంచ మార్కెట్లచే ప్రభావితమవుతాయి, ధరల హెచ్చుతగ్గులలో పారిశ్రామిక డిమాండ్ కీలక పాత్ర పోషిస్తుంది.
చెన్నై..
24 క్యారెట్లు- రూ. 15,328, 22 క్యారెట్లు - రూ. 14,050, 18 క్యారెట్లు - రూ. 11,750
ముంబై..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426
బెంగళూరు..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426
హైదరాబాద్..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426
విజయవాడ..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426
విశాఖపట్నం..
24 క్యారెట్లు - రూ. 15,235, 22 క్యారెట్లు- రూ. 13,965, 18 క్యారెట్లు - రూ. 11,426

Click it and Unblock the Notifications