తెలంగాణపై నిర్ణయం తీసుకోనందుకే ఓటమి: కెఎల్ఆర్

Congress Logo
హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోనందునే తెలంగాణ ప్రాంతంలో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు కిచ్చెన్నగారి లక్ష్మా రెడ్డి శనివారం అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు జోగి రమేష్, ప్రతాప్‌ రెడ్డిలతో కలిసి కెఎల్ఆర్ సిఎల్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్‌లోని తెలంగాణ సీనియర్లు ఉప ఎన్నికల ఫలితాలపై రకరకాల విశ్లేషణలతో ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ అభ్యర్థులందరూ ఓడిపోవడానికి ప్రధాన కారణం తెలంగాణపై కేంద్రం, కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయం తీసుకోకపోవడమేనని ఆయన అన్నారు.

కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణపై అవునని లేదా కాదని స్పష్టంగా చెబితే బాగుండేదన్నారు. ఇప్పటికైనా అధిష్టానం తెలంగాణపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని కోరారు. తెలంగాణలో ఎన్నికలు జరిగితే రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి రాజీనామా చేయడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. కడప ఉప ఎన్నికల్లో పోటీ చేసి డిపాజిట్‌ను కోల్పోయినప్పుడు డిఎల్ ఎందుకు రాజీనామా చేయలేదన్నారు. అప్పుడే రాజీనామా చేయాల్సింది అన్నారు. నాడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయాలని కోరిన వాళ్లలో తానూ ఒకడినన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+