వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐదుగురికి ప్రాణాలు పోస్తున్న బ్రెయిన్ డెడ్ టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

Bangalore Map
బెంగళూర్: ఓ బ్రెయిన్ డెడ్ టెక్కీ ఐదుగురికి ప్రాణాలు పోయనున్నాడు. బెంగళూర్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు 29 ఏళ్ల టెక్కీ విషయంలో ప్రకటించారు. అతని అవయవాలను దానం చేయడానికి అతని కుటుంబ సభ్యులతో పాటు భార్య అంగీకరించారు. బెంగళూర్‌లోని జెపి నగర్‌కు చెందిన శరత్ పిఆర్ అనే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ హైదరాబాదు నుంచి బెంగళూర్ వెళ్తుండగా మార్చి 18వ తేదీన ప్రమాదానికి గురయ్యాడు. భార్య స్వల్ప గాయాలతో బయటపడగా తీవ్రంగా గాయపడిన శరత్‌ను బెంగళూర్‌లోని కొలంబియా ఆసియా ఆస్పత్రిలో చేర్చారు. అతని బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ఆదివారంనాడు ధ్రువీకరించారు.

కర్ణాటక జోనల్ కోఆర్డినేషన్ కమిటీ సభ్యులు, వైద్యులు నచ్చజెప్పడంతో శరత్ అవయవాలను దానం చేయడానికి అతని బంధువులు ముందుకు వచ్చారు. కార్నియా, కాలేయం, మూత్ర పిండాలను, గుండె నాళాలను దానం చేయడానికి వారు ముందుకు వచ్చారు. శరత్ కుటుంబ సభ్యులు ధైర్యంతో కూడిన నిర్ణయం తీసుకున్నారని కొలంబియా ఆసియా ఆస్పత్రి జనరల్ మేనజర్ జెరెమీ డిసౌజా అన్నారు.

English summary
29-year-old techie will breathe life into at least five persons , after his family, including newly wed wife, decided to donate his organs on Sunday after he was declared braindead at a Bangalore hospital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X