నేడు చిరంజీవి రాజీనామా, మేలో ఉప ఎన్నికలు

మరోవైపు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం నేతల రాజీనామాలతో ఖాళీ అయిన 17 నియోజకవర్గాల ఉప ఎన్నికలు మేలో జరిగే అవకాశముంది. పదిహేడు అసంబ్లీ, ఎస్పీఎస్ నెల్లూరు లోకసభ స్థానానికి త్వరలో ఎన్నికలు జరపనున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్ వై ఖురీషీ సోమవారం చెప్పారు. జూన్ నెలలో రాష్ట్రపతి ఎన్నికలు ఉన్న దృష్ట్యా ఆ లోపే దేశంలోని అన్ని స్థానాలలో ఉప ఎన్నికలు జరిపాలని నిర్ణయించుకున్నట్లు ఖురేషి చెప్పారు. తిరుపతి స్థానంపై తనకు ఇప్పటి వరకైతే తెలియదన్నారు.
చిరంజీవి అప్పటి వరకు రాజీనామా చేయనందున ఆ విషయం తెలియదు. చిరు మంగళవారం రాజీనామా చేయనున్నారు. దీంతో ప్రభుత్వం ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వెళ్తుంది. దీంతో పదిహేడు అసెంబ్లీ, ఎస్పీఎస్ నెల్లూరు లోకసభ స్థానంతో పాటే చిరంజీవి రాజీనామాతో ఖాళీ కానున్న తిరుపతిలోనూ ఉప ఎన్నికలు మేలో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications