మరోసారి కిరణ్ కుమార్ రెడ్డిపై పెద్దిరెడ్డి తిరుగుబాటు

Peddireddy Ramachandra Reddy
హైదరాబాద్: మాజీ మంత్రి, కాంగ్రెసు శాసనసభ్యుడు పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తిరుగుబాటు బావుటా ఎగురేశారు. కిరణ్ కుమార్ రెడ్డిని మించిన అసమర్థ ముఖ్యమంత్రి మరొకరు ఉండరని ఆయన అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి కన్నా సమర్థులు కాంగ్రెసులో చాలా మంది ఉన్నారని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ముఖ్యమంత్రి సీట్లో కిరణ్ కుమార్ రెడ్డి మినహా మరెవరు ఉన్నా తనకు సమ్మతమేనని ఆయన అన్నారు. ఈ విషయంపై ఏప్రిల్ 2వ తేదీన తాను పార్టీ అధిష్టానాన్ని కలుస్తానని ఆయన చెప్పారు.

ముఖ్యమంత్రిని మార్చడమే అందరి ఎజెండా అని ఆయన అన్నారు. తమవి ఒత్తిడి ప్రయత్నాలేనని ఆయన చెప్పారు. తాను బహిరంగంగా మాట్లాడుతున్నానని, మిగతావారి మనస్సుల్లో కూడా అదే ఉందని ఆయన అన్నారు. తాను ఏళ్ల తరబడి కాంగ్రెసు కోసం పనిచేశానని ఆయన చెప్పుకున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను కాంగ్రెసు చిత్తూరు జిల్లా అధ్యక్షునిగా తొమ్మిది స్థానాల్ోల కాంగ్రెసును గెలిపించానని ఆయన అన్నారు. పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చాలా విషయాలు మాట్లాడారని, సూచనలు చేశారని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+