అన్నీ విని అంతా భేషన్న పరిశీలకుడు కృష్ణమూర్తి

రోటీన్ వ్యవహారంలో భాగంగానే తాను హైదరాబాదు వచ్చానని ఆయన చెప్పారు. డిసిసిల ఖాళీలను భర్తీ చేస్తామని, మార్పులు చేర్పులూ చేపడతామని ఆయన చెప్పారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యాన్ని సహించబోమని ఆయన చెప్పారు. రాష్ట్ర కాంగ్రెసు పరిస్థితి గందరగోళంగా మారిన స్థితిలో, ముఖ్యమంత్రిపై అసమ్మతి వర్గం ధ్వజమెత్తుతున్న వాతావరణంలో ఆయన రాష్ట్రానికి వచ్చారు.
కాంగ్రెసు నాయకులు, శాసనసభ్యులు, మంత్రుల అభిప్రాయాలను విన్న ఆయన గులాం నబీ ఆజాద్‌కు ఓ నివేదికను సమర్పిస్తారని తెలుస్తోంది. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితోనూ పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతోనూ ఆయన సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications