తెలంగాణ కోసం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య

కరీంనగర్ జిల్లాలో ఓ విద్యార్థిని తెలంగాణ కోసం మంగళవారం ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. ఇంటర్మీడియట్ చదువుతున్న పల్లవి అనే విద్యార్థిని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. కరీంనగర్ జిల్లా కోనరావుపేట మండంల నిజామాబాద్ గ్రామంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆమె స్థానిక జూనియర్ కళాశాలలో చదువుతూ ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు రాసింది. ఇంట్లో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న పల్లవిని కుటుంబ సభ్యులు సిరిసిల్ల ఆస్పత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications