కిడ్నాపైన తెలుగు యువత నాయకుడి దారుణ హత్య

అదే రోజు రాత్రి చంద్రశేఖర రెడ్డి కారు ఎస్సార్ నగర్‌లోని ఓ రెస్టారెంట్ వద్ద చంద్రశేఖర రెడ్డి, మరో మిత్రుడు కారును వెనక్కి తీస్తుండగా వాచ్‌మెన్‌కు గాయాలయ్యాయి. దీనిపై పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో వారు కారును అక్కడే వదిలిపెట్టి వెళ్లారు. పోలీసులు కారును స్వాధీనం చేసుకున్నారు. సోమవారం చంద్రశేఖర రెడ్డి భార్య సుజాత ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కారు చూశారు. కారున్నా భర్త లేకపోవడంపై ఆరా తీశారు. కెపిహెచ్‌బి పిఎస్‌లో అదృశ్యమైనట్లు కేసు పెట్టినట్లు చెప్పారు. అయితే మంగళవారం రాత్రి చంద్రశేఖర రెడ్డి మృతదేహం గోనె సంచిలో లభించింది. పోలీసులు విచారిస్తున్నారు. చంద్రశేఖర రెడ్డి సతీమణి సుజాత అనుమానితుల పేర్లు చెప్పారని సమాచారం.












Click it and Unblock the Notifications