హరికృష్ణ వ్యాఖ్యలకు బాబు కౌంటర్, జగన్‌పై దాడి

Chandrababu Naidu
హైదరాబాద్: తన బావ మరిది, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ చేసిన వ్యాఖ్యలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కౌంటర్ ఇచ్చారు. కుటుంబ వేరు, పార్టీ వేరని ఆయన తనదైన శైలిలో చంద్రబాబు జవాబు ఇచ్చారు. కుటుంబ సభ్యులు పార్టీలో ఉన్నా క్రమశిక్షణతో వ్యవహరించాల్సిందేనని ఆయన అన్నారు. కుటుంబ సభ్యులు కలిసి భోజనం చేయడం వేరు, పార్టీలో వ్యవహరించడం వేరు అని ఆయన అన్నారు. హరికృష్ణ పార్టీకి దూరంగా ఉంటున్నారని మీడియా ప్రతినిధులు ప్రస్తావించినప్పుడు ఆయన ఆ విధంగా అన్నారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన గురువారం అసెంబ్లీ లాబీలో కేక్ కట్ చేశారు. చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు స్వీప్ చేస్తుందని ప్రచారం చేశారని, పులివెందుల, కుప్పం తప్ప అన్ని స్థానాలనూ గెలుచుకుంటారని ప్రచారం సాగించారని, ఇప్పుడు వైయస్ జగన్ పార్టీ విషయంలో కూడా అదే రకమైన ప్రచారం సాగిస్తున్నారని, పునాలుదు లేని పార్టీ నిలబడదని ఆయన అన్నారు. తమ పార్టీ పునాదులు బలంగా ఉన్నాయని ఆయన అన్నారు.

తెలంగాణపై పార్టీలో చర్చిస్తున్నామని ఆయన చెప్పారు. తెలంగాణ సెంటిమెంటు ఉన్నా తెలంగాణ ప్రజల్లో తమ పార్టీపై అభిమానం ఉందని, తమ ఇబ్బందులను ప్రజలు అర్థం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ తమకు సున్నితమైన సమస్య అని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను కాంగ్రెసు మరింత జఠిలం చేస్తోందని ఆయన విమర్శించారు. తెలంగాణ విషయంలో తాము ఎదుర్కుంటున్న సమస్యను అధిగమించే ప్రయత్నం చేస్తామని ఆయన చెప్పారు. తనపై వచ్చిన ఆరోపణలను రుజువు చేయలేకపోయారు కాబట్టే విశ్వసనీయత లేదని తనపై జగన్ తప్పుడు ప్రచారం సాగిస్తున్నారని ఆయన విమర్శించారు. ఎదురుదాడితో బయటపడాలని జగన్ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. కోవూరులో తాము వ్యూహాత్మక తప్పిదం చేశామని ఆయన అనన్నారు.

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత రాష్ట్రంలో సంచలనాత్మక మార్పులు వచ్చాయని ఆయన అన్నారు. దోచిపెట్టడాన్ని కూడా విశ్వసనీయత అని అంటున్నారని ఆయన అన్నారు. జగన్‌లా తప్పు చేసి ఉంటే తాను బయట తిరగలేకపోయేవాడినని ఆయన అన్నారు. దేశంలో నాయకత్వ కొరత ఉందని ఆయన అన్నారు. రక్షణ శాఖలో అవినీతి సహించలేనిదని ఆయన అన్నారు. వీసి పోస్టులను కూడా అమ్ముకున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ పెద్దలు కమిషన్లు తీసుకుంటున్నారని ఆయన ఆరోపించారు.

తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని మాజీ మంత్రి పి. శంకరరావు గురువారం ఉదయం కలిశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై గుర్రుగా ఉన్న శంకరరావు చంద్రబాబును కలుసుకోవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శంకరరావు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+