చంద్రబాబుతో హరికృష్ణ ఫైట్: రిజర్వ్‌లో జూ. ఎన్టీఆర్

అవసరమైనప్పుడు జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి సేవలు అందిస్తారని ఆయన చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్‌కు రాజకీయానుభవం కావాలని కూడా ఆయన అన్నారు. గతంలో ఒకటి రెండు సార్లు కూడా ఆయన ఇదే విధంగా మాట్లాడారు. అంటే, జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీ అంతర్గత విభేదాలకు కాస్తా దూరంగా ఉంచాలని ఆయన అనుకుంటున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుతో అమీతుమీ తేల్చుకున్న తర్వాతనే జూనియర్ ఎన్టీఆర్‌ను రంగంలోకి దించాలని ఆయన అనుకుంటున్నట్లు చెబుతున్నారు. పైగా, జూనియర్ ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉన్నారు. సినిమాల్లో జూనియర్ ఎన్టీఆర్ సత్తా చాటుకోవాలని అనుకుంటున్నట్లు భావిస్తున్నారు. హరికృష్ణ సూచిస్తే ఆయన రాజకీయాల్లో తన వంతు పాత్ర నిర్వహించడానికి ఇప్పటికీ సిద్ధంగానే ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, హరికృష్ణ గురువారంనాడు మరో అడుగు ముందుకేసి వ్యాఖ్య చేశారు. టిడిపి నందమూరి కుటుంబానిదేనని ఆయన అన్నారు. తద్వారా అది నారా కుటుంబానిది కాదని, చంద్రబాబు కుమారుడు నారా లోకేష్‌కు పార్టీ పగ్గాలు దక్కకూడదని ఆయన చెప్పదలుచుకున్నట్లు భావిస్తున్నారు. అదును చూసి చంద్రబాబు నుంచి హరికృష్ణ పార్టీని తమ చేతుల్లోకి తీసుకుంటారా, పార్టీని చీలుస్తారా అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అయితే, హరికృష్ణకు చంద్రబాబును ఎదుర్కునే వ్యూహరచన, ప్రణాళిక, సత్తా ఉన్నాయా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.












Click it and Unblock the Notifications