హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తలలు పట్టుకుంటున్నారు: జయప్రకాశ్ నారాయణ

By Srinivas
|
Google Oneindia TeluguNews

Jayaprakash Narayana
హైదరాబాద్: చట్టసభల్లో ఏ సమస్యకూ పరిష్కారం దొరక్కపోవడం దురదృష్టకరమని లోక్‌సత్తా అధినేత, కూకట్‌పల్లి శాసనసభ్యుడు జయప్రకాశ్ నారాయణ గురువారం ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలకు అతీతంగా సగం మందికి పైగా శాసనసభ్యులు తాము ఎందుకు ఎన్నికయ్యామా అని తలలు పట్టుకుంటున్నారు. ఈ బడ్జెట్ సమావేశాల తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆయన అన్నారు. బడ్జెట్ సమావేశాలు గురువారంతో ముగిశాయి. 28 రోజులు సమావేశాలు జరిగాయి. ఏ అంశం పైనా ఎలాంటి చర్చ జరగకుండానే అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది. తెలంగాణ నినాదాలు మధ్య ద్రవ్య వినిమయ బిల్లును సభ ఆమోదించింది. ఇటీవల స్టేషన్ ఘనపూర్ నుండి ఎన్నికైన తాటికొండ రాజయ్య అసెంబ్లీ కార్యదర్శి సదారాం మైక్‌ను విరగ్గొట్టారు. తెలంగాణ వాదంతో గెలిచిన తనకు సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వరా అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాగా బడ్జెట్ సమావేశాల్లో ఏ అంశం పైనా సంపూర్ణ చర్చ జరగలేదు. మద్యం సిండికేట్లు, తెలంగాణ అంశంపై సభలో విపక్షాలు అధికార కాంగ్రెసు పార్టీని నిలదీశాయి. గత నాలుగు రోజులుగా తెలంగాణ రాష్ట్ర సమితి, తెలంగాణ తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తెలంగాణ అంశంపై సభలో ఆందోళన చేశాయి.

English summary
Loksatta president Jayaprakash Narayana disappointed on Assembly sessions.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X